రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు

Dec 20 2025 9:12 AM | Updated on Dec 20 2025 9:12 AM

రైతుబ

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు

తాంసి: భీంపూర్‌ మండలంలోని కరంజి(టీ) గ్రామానికి చెందిన ఎల్టి కార్తిక్‌రెడ్డి గ్రూప్‌–3 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందని కార్తిక్‌ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. 2023లో నిజాం కాలేజీలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాడు. కార్తిక్‌రెడ్డి తల్లిదండ్రులు రాధ–సుదర్శన్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటే కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను దగ్గరగా చూసిన కార్తిక్‌ ఎలాగైనా ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంలో గ్రూప్‌–3 ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు కార్తిక్‌రెడ్డిని అభినందించారు. కాగా, గ్రూప్‌–1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తానని కార్తిక్‌రెడ్డి చెబుతున్నాడు.

తలమడుగు: గ్రూ ప్‌–3 ఫలితాల్లో రైతుబిడ్డ సత్తా చాటాడు. మండలంలోని అర్లీ(కే) గ్రామానికి చెందిన కళ్ల సందీప్‌ రాష్ట్ర స్థా యిలో 202 ర్యాంక్‌, జోనల్‌ స్థాయిలో 28వ ర్యాంక్‌ సాధించాడు. ట్రెజరీ విభాగంలో సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సందీప్‌ది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కృష్ణ, సు వర్ణ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కా గా, మొదటి కుమారుడు సాయికుమార్‌, రెండోకుమారుడు సందీప్‌. దేవపూర్‌ గ్రామంలో సందీప్‌ పదోతరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటూ గ్రూ ప్‌–3కి ప్రిపేరయ్యాడు. కోచింగ్‌ లేకుండానే రాష్ట్రస్థాయిలో 202 ర్యాంక్‌ సాధించి ట్రెజరర్‌ విభాగంలో సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగం సాధించగా గ్రామస్తులు అభినందిస్తున్నారు.

సందీప్‌

కుంటాల: మండల కేంద్రానికి చెందిన తాటి సాయితేజ గ్రూప్‌–3లో 920వ ర్యాంక్‌ సాధించాడు. సీఐడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గ్రూప్‌–4లోనూ 540 ర్యాంక్‌ సాధించి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికై భైంసా ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి శోభ బీడీ కార్మికురాలు, తండ్రి మహేశ్‌ రైతు. ఈ సందర్భంగా సాయితేజను గ్రామస్తులు అభినందించారు.

భీంపూర్‌: మండలంలోని కై రిగూడ గ్రామానికి చెందిన మెస్రం రే ణుక–జైవంత్‌రావు దంపతుల కుమారు డు హరిదాస్‌ ఇటీవల విడుదలైన గ్రూప్‌–3 ఫలితాల్లో సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. హరి దాస్‌ మారుమూల గ్రామం నుంచి ఉద్యోగం సాధించగా గ్రామస్తులు అభినందించారు.

సాయితేజ

హరిదాస్‌

తాంసి: మండల కేంద్రానికి చెందిన పోలి పెల్లి అజయ్‌ గ్రూప్‌ –3లో రాష్ట్రస్థాయిలో 874 ర్యాంక్‌ సాధించి ఇంటర్మీడియట్‌ అధికా రిగా ఉద్యోగం సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అజయ్‌ తండ్రి రామకృష్ణ మృతి చెందాడు. తల్లి లక్ష్మి వ్యవసాయం చేస్తూనే ఇద్దరు ఆడపిల్లలతోపాటు కుమారుడు అజయ్‌ని చదివించింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన అజయ్‌ ఆది లాబాద్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు. కరీంనగర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదివాడు. 2023 నుంచి 2024 వరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యాడు. గ్రూప్‌–2లో 444 ర్యాంక్‌ సా ధించినా ఉద్యోగం రాలేదు. అయినప్పటికీ పట్టువదలకుండా చదువుతూ గ్రూప్‌–3లో ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించాడు. ఒక వైపు పరీక్షలకు సన్నద్ధమవుతూనే చదువు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా కాలేజీల్లో బీఎడ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తల్లి పడుతున్న కష్టాన్ని చూసి మంచి ఉద్యో గం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగాలకు సన్నద్ధమైనట్లు అజయ్‌ తెలిపాడు. ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యో గం సాధించడం సుళువేనని చెబుతున్నాడు. గ్రూప్‌–3లో ఉద్యోగం సాధించిన అజయ్‌ను తాంసి గ్రామస్తులు అభినందించారు.

అజయ్‌

కార్తిక్‌రెడ్డి

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు 1
1/4

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు 2
2/4

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు 3
3/4

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు 4
4/4

రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement