అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.20 లక్షలతో నిర్మించిన అంబేడ్కర్ భవనం, రూ.9.55 లక్షలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ అంబేడ్కర్ భవనం విస్తరణకు మరో రూ.20 లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పారు. వంద పడకల ఆస్పత్రి పనులు మే వరకు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. 50పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మాతాశిశు ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై కమిషనర్‌తో సమీక్ష నిర్వహించారు.
అధికారులపై మంత్రి ఆగ్రహం
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకుండా ప్రారంభోత్సవం చేపట్టారని సంబంధిత అధికారులపై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు భవనాల మధ్య కప్పు వేయాల్సి ఉంది, ప్లాట్‌ఫాం పూర్తి చేయడం లేదని ఎలా చెప్పావు అని కమిషనర్‌పై మండిపడ్డారు. పాత కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని డీఈ వివరించారు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేయాలని, మార్కెట్‌కు రావాల్సిన రూ.1.90కోట్లు పెండింగ్ నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కూరగాయల ప్లాట్‌ఫాం పనులు నెలాఖారులోగా పూర్తి చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలి
చెన్నూర్: సర్పంచ్‌లు పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం చెన్నూర్ నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నంటి రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, ఉప సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


