గుడుంబా తయారీ అరికట్టాలి
మంచిర్యాలక్రైం: జిల్లాలో గుడుంబా తయారీ అరికట్టాలని బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి శుక్రవారం జిల్లా ఎకై ్సజ్ అధికారి నందగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. వేమనపల్లి మండలం భుయ్యారం గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలు వెలిశాయని, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భుయ్యారం గ్రామ గుడుంబా నిషేధిత కమిటీ అధ్యక్షురాలు ముడిమడుగుల లావణ్య, ఏస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గం ఎల్లయ్య, ఈశ్వరి, రాజేశ్వరి, బుచ్చక్క, లక్ష్మి, రామక్క, సత్తక్క, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి
మంచిర్యాలటౌన్: సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, శిశువు మృతికి కారణమైన డాక్టర్ ఎం.శ్రీలత లైసెన్స్ రద్దు చేయాలని, మంచిర్యాలలోని నర్సింగ్ హోంను సీజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు దుర్గం ఎల్లయ్య, దుర్గం రాజేశ్వర్, బాధితుడు వసంతరావు పాల్గొన్నారు.


