ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఆదిలాబాద్‌రూరల్: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా విద్యార్థులు కఠినమైన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు మోడల్ పేపర్లను పదేపదే రాయాలని, ఏదైనా సబ్జెక్టు కఠినంగా అనిపిస్తే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు, సహాయ వెనుకబడిన అభివృద్ధిశాఖ అధికారి సోనియా, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, వసతిగృహ సంక్షేమాధికారులు జే నర్సింలు, చిన్నయ్య, జావీద్, ప్రభాకర్, సంతోష్, రజనీకాంత్‌రెడ్డి, కల్పన తదితరులున్నారు.
నిందితుడికి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: సెల్‌ఫోన్‌ను దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపా రు. గురువారం పట్టణంలోని ముస్కాన్ ట్రావెల్స్‌లో ఇందిరానగర్‌కు చెందిన రవి సెల్‌ఫోన్ చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
బైక్ చోరీ నిందితుల అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ద్విచక్రవాహనం చోరీకి పా ల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగారాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణా నికి చెందిన న్యాయవాది రామారావుకు చెంది న ద్విచక్రవాహనాన్ని మావలకు చెందిన ఎడగంటి భీమన్న, పల్లపు లక్ష్మణ్ పంజాబ్ చౌక్‌లో చోరీ చేశారు. ఆ వాహనాన్ని సాయిబాబు వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు.


