ప్రోత్సాహం లేక జాతీయ స్థాయిలోనే ఆగిపోయా..
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ గిరిజన క్రీడా పాఠశాలలో 2002 నుంచి 2005 వరకు చదువుకున్నాను. కోచ్ రఘునాథ్‌రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో గద్వాల్‌లో, జాతీయ స్థాయిలో జమ్ముకశ్మీర్‌లో ఆడి మొదటి స్థానంలో నిలిచాను. 2005లో 10వ తరగతి పూర్తి చేసుకున్న సమయంలో ఉట్నూర్ క్రీడా పాఠశాలను ఎత్తివేశారు. అనంతరం ఇంటర్ ఆదిలాబాద్‌లోని ఫుట్‌బాల్ అకాడమీలో చేరడానికి వెళ్లగా దానినీ ఖమ్మం జిల్లాకు తరలించారు. దీంతో ఉట్నూర్‌కు వచ్చి ఇంటర్ పూర్తి చేశాను. ప్రభుత్వాలు అవకాశం కల్పించకపోవడంతో 2005లో నేషనల్ స్థాయిలోనే ఆగిపోయాను. ప్రస్తుతం ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. ప్రభుత్వాలు దృష్టి సారించి ఆదిలాబాద్, ఉట్నూర్‌లో ఫుట్‌బాల్ అకాడమీలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశముంది. క్రీడా పాఠశాలల్లో ఫుట్‌బాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పిస్తే గిరిజన విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తప్పనిసరిగా కృషి చేస్తా.
– పాండురంగ్,
జాతీయస్థాయి క్రీడాకారుడు


