ఒక్క పైసా రాలే
పిల్లల వివాహాలు, చదువులు, వైద్యఖర్చులకు రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడుతాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్‌ను అందించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని బిల్లులిస్తే ఏళ్లు గడిచినా రావడం లేదు. వచ్చినా సగం డబ్బులే చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేశామంటున్నా ఒక్క పైసా రాలేదు.
– ఎస్.సుధాకర్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు


