వేధింపులు తాళలేక భర్తను చంపిన భార్య
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ మాటేటి చంద్రయ్య (50)ను ఆయన భార్య లక్ష్మి స్టీల్ రాడ్‌తో బాదడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య మద్యానికి బానిసై తరచూ భార్య, కూతురును వేధించేవాడు. ఆదివారం మధ్యరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను వేధించాడు. దీంతోఅతడి వేధింపులు భరించలేక భార్య లక్ష్మి స్టీల్ రాడ్‌తో పలుసార్లు అతడి తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ శశిధర్‌రెడ్డి వెళ్లి వివరాలు సేకరించారు. సోమవారం మృతుడి సోదరి దూడం లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


