అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో గెలిచి
లోకేశ్వరం మండలం బాగాపూర్ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. సర్పంచ్‌గా ముత్యాల శ్రీవేద బరిలో నిలిచారు. దీంతో అమెరికాలో ఉంటున్న ఆమె మామ ఇటీవల వచ్చి ఓటేశాడు. ఈ పంచాయతీ పరిధిలో 426 ఓట్లుండగా ఇందులో 378 ఓట్లు పోలయ్యాయి. ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా, మరో అభ్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకపోవడంతో అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓటు రావడంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందగా, ఆమె మామ ఓటే ఆమెకు కీలకమైందని అంతా చర్చించుకున్నారు.


