నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
దహెగాం: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్‌ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచారు.
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు


