ఎస్టీలు లేకున్నా ఏజెన్సీ గ్రామంగా రూయ్యాడి
తలమడుగు: అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలతో సందడిగా మారగా మండలంలో రూయ్యాడి గ్రామంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. రుయ్యాడిని 1970లో ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీని పరిధిలో సకినాపూర్, అర్లీ, రూయ్యడి అనుబంధ గ్రామాలుండగా సకినాపూర్, అర్లి నూతన పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రూయ్యడీ గ్రామపంచాయతీలో ఎస్టీ అభ్యర్థులెవరూ లేరు. దీంతో గ్రామం సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 1,514 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవరూ లేరు. దీంతో 10వ వార్డు స్థానాలుండగా ఐదింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఐదు వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామంలో ఎస్టీలెవరూ లేకపోవడంతో ఎస్టీలకు కేటాయించినందున గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రుయ్యాడి గ్రామన్ని ఏజెన్సీ గ్రామం నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఒకే కుటుంబానికే రెండు పర్యాయాలు
ఎస్టీలు లేకున్నా ఏజెన్సీ గ్రామంగా రూయ్యాడి


