షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ఇంద్రవెల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. బాధిత కుటుంబీకులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దు ర్వగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం వ్యవసా య పనులకు చేనుకు వెళ్లారు. మధ్యాహ్నం 12గంటలకు షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.65వేల నగదు, ఐదు క్వింటాళ్ల పత్తి, శ్రీకాంత్ తల్లి లచ్చుబాయి, భార్య సులోచనకు చెందిన రెండు తులాల బంగారం, నిత్యావసరాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సాయన్న, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి సుమారు రూ.6లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. అనంతరం తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందజేశారు. ఇల్లు, ఇంట్లోని సామగ్రి కాలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు విలపించారు. అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.


