చెప్పడం కాదు.. రాసి ఇవ్వండి
బోథ్: మండల కేంద్రంలోని 15వ వార్డుకు చెందిన కిరాణా దుకాణ యజమాని అజీమ్ పంచాయతీ ఎన్నికల్లో తనను ఓటు అడగడానికి వచ్చే అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకుంటున్నాడు. తమ కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నికై న ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అభ్యర్థులకు అజీమ్ మొదట సమస్యలు స్పష్టంగా పేర్కొంటూ రాసిన ప్లకార్డు చూపిస్తున్నారు. ఆ తర్వాత, ‘గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తాం’ అనే అంశంతో కూడిన ప్రత్యేక హామీ పత్రాన్ని సిద్ధం చేసి, దానిపై అభ్యర్థుల సంతకాలు తీసుకున్నారు. అభ్యర్థి సంతకంతో ఉన్న ఆ హామీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో న్యాయపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఓటు ఒక సాధనంగా ఉపయోగించుకుంటూ బాధ్యతాయుతంగా ముందుకు రావడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హామీ పత్రాన్ని చూపిస్తున్న బిలాల్ అజీమ్


