ఏజెన్సీ గ్రామం.. ఒకే కుటుంబానికి పట్టం
తాండూర్: మండలంలో రెండు ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కటైన కిష్టంపేట గ్రామపంచాయతీ ఓటర్లు ఒకే కుటుంబానికే పలుసార్లు పట్టం కట్టారు. 2001 ఎన్నికల్లో కిష్టంపేట సర్పంచ్‌గా సార్ల తిరుపతి గెలుపొందారు. ఆ తర్వాత అతని తల్లి సార్ల ఓదమ్మ వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికై ంది. 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి తమ్ముడి భార్య సార్ల పద్మను గ్రామ ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. తాజాగా సార్ల తిరుపతి సర్పంచ్‌గా గెలుపొందాడు. గడిచిన ఐదు ఎన్నికల్లో నాలుగు దఫాలు ప్రజలు ఈ కుటుంబానికే పట్టం కట్టడం విశేషం.
నాడు ఎంపీపీ.. నేడు సర్పంచ్
లోకేశ్వరం: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన బాయమోల్ల లలిత 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొంది మండల అధ్యక్షురాలుగా పని చేశారు. ఎస్సీకి రిజర్వ్ చేసిన మన్మద్ స్థానానికి సర్పంచ్‌గా పోటీ చేసి ఈనెల 14న నిర్వహించిన ఎన్నికల్లో తిరిగి లలిత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఏజెన్సీ గ్రామం.. ఒకే కుటుంబానికి పట్టం


