ఒకే పాలకవర్గం.. మూడు జంటలు
దండేపల్లి: రిజర్వేషన్ల పుణ్యమా..అంటూ ఒకే పంచాయతీ పాలకవర్గంలో భార్య, భర్తకు అదృష్టం కలిసొచ్చింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దండేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గంలో మూడు జంటలకు ఆ ప్రత్యేకత దక్కింది. దండేపల్లి సర్పంచ్‌గా అజ్మేరా రాజేశ్వర్, మూడో వార్డు సభ్యురాలిగా ఆయన భార్య అజ్మేరా సుజాత ఎన్నికయ్యారు. రెండో వార్డు సభ్యుడిగా తొడసం జైతు ఎన్నిక కాగా, ఐదో వార్డు సభ్యురాలిగా ఆయన భార్య తొడసం సునీత ఏకగ్రీవంగా ఎన్నికై ంది. నాలుగో వార్డు సభ్యురాలిగా పెంద్రం రేవతి, ఎనిమిదో వార్డు సభ్యుడిగా ఆమె భర్త పెంద్రం శంకర్ ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరనున్న దండేపల్లి పంచాయతీ పాలకవర్గంలో మూడు జంటలకు ఇలా ప్రత్యేక చోటు లభించింది.
ఒకే పాలకవర్గం.. మూడు జంటలు
ఒకే పాలకవర్గం.. మూడు జంటలు


