నష్టాలు తప్పేలా లేవు
రూ.10లక్షలు అప్పు చేసి ఏడెకరాల్లో మిర్చి సాగు చేసిన. పోయినేడాది 15 ఎకరాల్లో సాగు చేయగా ధర లేక నష్టపోయిన. ఈ ఏడాది ధర బాగుంటుందని ఆశపడి ఏడెకరాలు సాగు చేసిన. పంట దిగుబడి బాగా వచ్చి లాభం వస్తుందని అనుకున్న. కొత్త తెగుళ్లు సోకడంతో పంటంతా నాశనమవుతోంది. ఎకరాకు ఆరు, ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈసారి కూడా నష్టాలు తప్పేలా లేవు.
– భూతం సంతోష్, రైతు, చెన్నూర్
వాతావరణ మార్పులతోనే..
మొక్క దశలో తెగుళ్లు సోకడంతో మందులతో నయమైంది. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనే సమయంలో ఎర్రనల్లి, తెల్లదోమ సో కింది. వేలాది రూపాయలు వెచ్చించి మందులు కొట్టినా లాభం లేకుండా పోయింది. చెట్టు నుంచి ఆకుల వరకు ముడత పడి కాయ పెరగడం లేదు. పెరిగిన కాయ ఎరుపు వర్ణంలోకి మారకముందే ఎండి తాలుగా మారుతోంది. ఈ తెగుళ్లతో దిగుబడి రెండింతలు తగ్గనుంది.
– మానిశెట్టి శ్రీనివాస్, రైతు, చెన్నూర్
నష్టాలు తప్పేలా లేవు


