కన్నాల బస్తీలో వైద్య శిబిరం
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ కన్నాల బస్తీలో సోమవారం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెగకుండా మూడు వారాలకు పైగా దగ్గు వస్తున్న వ్యక్తులు టీబీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందిస్తూ నెలకు రూ.1000 చొప్పున చికిత్స పూర్తయ్యే వరకు పోషణ భత్యాన్ని అందిస్తుందని తెలిపారు. అనంతరం పలువురికి ఎక్స్‌రేలు తీశారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యురాలు సుచరిత, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సురేందర్, సూపర్‌వైజర్ శశికాంత్, హెల్త్‌విజిటర్ వెంకటేష్ పాల్గొన్నారు.


