ఆధ్యాత్మిక శోభితం
నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు వైష్ణవాలయాల్లో నెలపాటు పూజలు ఈనెల 30న వైకుంఠ ద్వార దర్శనం జనవరిలో ఘనంగా గోదాకల్యాణం సంప్రదాయంగా సుదర్శన హోమం ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు
చెన్నూర్/నిర్మల్‌ఖిల్లా/మంచిర్యాల అర్బన్: ఆధ్యాత్మిక మాసాల్లో ధనుర్మాసానికి ప్రత్యేక మాసంగా పేరుంది. ధనుర్మాసో త్సవాలను చెన్నూర్ జగన్నాథాలయంలో 400 ఏళ్లుగా ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ధనుర్మాసంలో సూర్యుడు ధ నుస్సు రా శిలో ప్రవేశించి సూర్యుడు మకర రాశి లోకి మారినప్పుడు ధనుర్మాసం ముగుస్తుంది. ధ నుర్మాసంలో శ్రీమహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 16న మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 భోగి రోజున ముగుస్తుంది. ఆధ్యాత్మిక మాసం కావడంతో నెలపాటు భజన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించ ం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.
పండుగ నెలగా ప్రారంభం
ధునుర్మాస్మం ప్రారంభం నుంచి సంక్రాంతి పండుగ నెల ప్రారంభమవుతుంది. భక్తులు గోదాదేవికి (ఆండాల్) తిరుప్పావై పాశురాలను అలపించడం అనవాయితీగా వస్తోంది. ఈ మాసాన్ని ప్రారంభం నుంచే పండుగ నెల అని అంటారు. ఈ మాసంలో శుభకార్యాలు జరగవు. దైవిక కార్యాలు మాత్రమే నిర్వహిస్తారు.
గోదాదేవి, రంగనాథుల కల్యాణం
గోదారంగనాథుడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం లక్ష్మి స్వరూపమైన గోదారంగనాథుల కల్యాణంలో వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
30న ముక్కోటి ఏకాదశి
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు ఉ త్తర ద్వారం నుంచిస్వామివారి దర్శనం ఉంటుంది.
జనవరిలో సుదర్శన హోమం
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఏటా జనవరిలో చెన్నూర్ జగన్నాథాలయంలో సుదర్శన హోమం నిర్వహిస్తారు. సుదర్శన హోమానికి స్థానికులతోపాటు వివిధ పట్టణాల నుంచి వేలాదిమంది వచ్చి పూజలు చేస్తారు.
నిర్మల్‌లోని దేవరకోట ఆలయంలో...
నిర్మల్ పట్టణంలోని చారిత్రక పురాతన పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 16 నుంచి వచ్చే నెల 14వరకు ప్రవచన కార్యక్రమం ని ర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆళ్వారు దివ్యప్రబంధ ప్రాజెక్ట్ వారిచే నెలపాటు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లాలోని పలు వేంకటేశ్వరాలయాల్లోనూ ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు.
మంచిర్యాలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో..
మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథస్వామి ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి రోజున భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. 31న తిరుప్పావై సేవాకాలం, జనవరి 5న గోదాదేవికి మంజలి ఉత్సవం, అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 14న గోదారంగనాథస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఈవో ముక్తా రవి తెలిపారు.
ఆధ్యాత్మిక శోభితం
ఆధ్యాత్మిక శోభితం


