కల్తీ ఈత కల్లు తయారీ స్థావరంపై దాడి
గుడిహత్నూర్: మండలంలోని వైజాపూర్ గ్రా మంలోని ఓ పురాతన ఇంట్లో కల్తీ ఈత కల్లు త యారీ స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. సుమారు 400 లీటర్ల కల్తీ ఈత కల్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని సీతాగోందికి చెందిన సంతోష్‌గౌడ్ ఎన్నికల నేపథ్యంలో తన కల్లు దుకాణం మూసి వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ని త్యం ఉచితంగా కల్లు పంపిణీ చేస్తున్నాడని అదే వార్డులో పోటీలో ఉన్న ఆసిఫ్ ఆరోపించారు. జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలి పారు. దీంతో పోలీసులు కల్లు తయారు చేస్తు న్న స్థావరానికి వెళ్లి డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన కల్లుతో పాటు కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


