ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి
కాసిపేట: మండలంలోని దే వాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి లో సల్ఫాలవాగు దేవాపూర్ శివారు ప్రాంతంలో ఆటో బో ల్తాపడి దుర్గం గోపాల్ (55) అనే డ్రైవర్ మృతి చెందాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తుడు గోపాల్ ఆటోలో దేవాపూర్ నుంచి సోమగూడెం వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గోపాల్ గాయపడ్డాడు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గోపాల్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతదేహాన్ని బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


