చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామ సమీపంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని పట్టుకుని విచారించారు. ఇటీవల చోరీకి పాల్పడ్డ నిందితుడిగా గుర్తించారు. మండలంలోని కజ్జర్ల గ్రామనికి చెందిన తలర్ల హరీశ్ గ్రామంలో ఇటీవల దొంగతనానికి పాల్పడినట్లు తె లిపారు. పట్టుకుని విచారించగా కజ్జర్లలో ఈ మధ్యలో జరుగుతున్న దొంగతనాలు తానే చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి బంగారు చైన్, ఉంగరం సీజ్ చేసినట్లు తెలిపారు. సోమవారం సీఐ ఫణీందర్, ఎస్సై రాధిక నిందితుడి హరీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై రాధిక పేర్కొన్నారు.


