ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలి
మందమర్రిరూరల్: సింగరేణి ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలని జీఎం(ఎంఎస్), సేఫ్టీ కమిటీ కన్వీనర్ విజయ్‌కుమార్ అన్నారు. సింగరేణి 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని కేకే–5 గనిని ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సేఫ్టీ కమిటీ తనిఖీ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ నియమాలు పాటిస్తే విధి నిర్వహణలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అందించే ప్రథమ చికిత్సపై తెలియజేస్తూ రక్షణపై ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య, కేకే–5 గని మేనేజర్ శంభునాథ్‌పాండే, సేఫ్టీ కమిటీ సభ్యులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


