రక్షణే శ్రీరామ రక్ష
శ్రీరాంపూర్: సింగరేణిలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. గతంతో పోల్చితే కంపెనీలో ప్రమాదాల సంఖ్య తగ్గింది. మారిన టెక్నాలజీ, పనిపరిస్థితులు, వర్క్‌మెన్ కల్చ ర్, కొత్త రక్షణ పద్ధతులు వెరసి ప్రమాదాలు తగ్గుముఖంపట్టాయి. ఎనిమిదేళ్లుగా కంపెనీలో రక్షణ చర్యలు మరింత పకడ్బందీగా చేపడుతున్నారు. ఫ లితంగా గతంలో డబుల్ డిజిట్‌లో ఉన్న మరణాలు నేడు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ప్రమాదా లను పూర్తిగా రూపుమాపాలని పదేళ్లుగా జీరో హా ర్మ్ సింగరేణి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ, అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలు రక్షణ చ ర్యల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. రక్షణ చ ర్యల పేరుతో ఆడంబరాలు కాకుండా మరింత పటి ష్ట చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు రక్షణపై సమీక్షిస్తూ క్షేత్ర స్థాయిలో గుర్తించిన హెచ్చరికలకు అనుగుణంగా పటిష్ట రక్షణ చర్యలు చేపడితేనే ఈ లక్ష్యం నెరవేరుతుందని కార్మికులు పేర్కొంటున్నారు.
పెరిగిన భద్రత
గతంతో రూఫ్ కూలే ప్రమాదాలు అధికంగా జరిగే వి. ఇప్పుడు రూఫ్ బోల్టింగ్, సపోర్టింగ్ వ్యవస్థలో వచ్చిన కొత్త టెక్నాలజీతో ఇవి తగ్గాయి. గ్యాస్, నీటి దుర్ఘటనలు, సైడ్‌ఫాల్, హాలేజీ ప్రమాదాలు కూడా తగ్గాయి. తట్టా, చెమ్మస్ స్థానంలో ఎస్‌డీఎల్ యంత్రాలు రావడం, భూగర్భంలో కాలినడకన వెళ్లే బదులు మ్యాన్‌రైడింగ్ యంత్రాలు రావడం, గ్యాస్ ప్రమాదాలను పసిగట్టే గ్యాస్ డిటెక్టర్ పరికరాలు రావడంతో రక్షణకు మరింత ఊతమిచ్చింది. 2019లో ఏర్పాటు చేసిన సేఫ్టీ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్లతో రక్షణ చర్యలను నిత్యకృత్యంగా మాని టరింగ్ చేస్తున్నారు. ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వంటివి సత్ఫలితాలనిస్తున్నాయి. 2017 రెగ్యులేషన్స్‌లో భాగంగా చేసి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (ఎస్‌ఎంపీ)లు, సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌తో కార్మికులను ప్రమాదాల నుంచి తప్పించే చర్యలు కూడా మంచి ఫలితాలనిస్తున్నాయి.
కొనసాగుతున్న పక్షోత్సవాలు
రక్షణ చర్యలను మరింత పటిష్టం చేసి ఉద్యోగులకు అవగాహన కల్పించడం కోసం కంపెనీ వ్యాప్తంగా 56వ రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. పక్షోత్సవాలు ఈ నెల 8న ప్రారంభమై 20వరకు కొనసాగుతాయి. ప్రతీ గని, డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక తనిఖీ బృందం వచ్చి రక్షణ చర్యలను తనిఖీ చేసి ఉత్తమ ప్రమాణాలు పాటించిన వారికి సెంట్రల్ ఫంక్షన్‌లో బహుమతి ప్రదానం చేస్తారు. నేడు ఈ పక్షోత్సవా లతో కంపెనీ వ్యాప్తంగా సందడి నెలకొంది. ఉద్యోగు ్డలకు రక్షణపై మరింత అవగాహన కల్పించి తని ఖీ నిర్వహిస్తున్నారు.
శ్రీరాంపూర్‌లో రికార్డు నమోదు
రక్షణలో శ్రీరాంపూర్ ఏరియా ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచి రికార్డు నమోదు చేసుకుంది. 2023, 2024, 2025లో ఇప్పటివరకు ఒక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగలేదు. వరుసగా మూడేళ్లలో ఒక్క కార్మికుని ప్రాణాలు కో ల్పోకపోవడం రికార్డుగా చెప్పవచ్చు. సీరియస్ ప్రమాదాలను పరిశీలిస్తే 2023లో 14, 2024లో 18, 2025లో 17 ప్రమాదాలు జరి గాయి. గత 55వ రక్షణ పక్షోత్సవాల్లో శ్రీరాంపూర్ ఏరియా గనులు, డిపార్ట్‌మెంట్‌లో కంపెనీ స్థాయిలో 18 బహుమతులు సాధించింది.


