ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ప్రలోభం
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేట పంచాయతీలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ప్రచారం జరగడంతో ప్రజలు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులతో రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు రైతు వేదిక వద్దకు వెళ్లడంతో సదరు నాయకులు అక్కడ నుంచి జారుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రచారం జరగడంతోనే ఇక్కడకు వచ్చామని గ్రామస్తులు తెలిపారు. ఓట్లకోసం అమాయక ప్రజలను ప్రలోభాలకు గురిచేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


