పరదా మాటున ఓటింగ్..
తాంసి: పరదాలు కట్టిన గదుల్లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న దృశ్యం తాంసి మండలంలోని హస్నాపూర్‌లో చోటు చేసుకుంది. మండలంలోని హస్నాపూర్‌లో 674 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండు గదులు మాత్రమే ఉన్నాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సరిపడా గదులు లేకపోవడంతో చేసేదేంలేక అధికారులు గదుల బయట ఉన్న పిల్లర్లకు చుట్టూ పరదాలు (గ్రీన్ మ్యాట్) కట్టి ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఇదేమిటని అక్కడ ఉన్న అధికారులను అడిగితే గదులు లేకపోవడం వల్ల తాత్కాలికంగా పరదాలతో తయారుచేసిన గదిలో ఓటింగ్ నిర్వహించడం జరిగిందని చెప్పడం విశేషం.


