పోలింగ్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ఆదిలాబాద్‌రూరల్: మావల గ్రామ పంచాయతీలో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు మహిళా ఓటర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు బీఎల్‌వోలను కలిసి పోల్ చీటీలు ఇవ్వాలని కోరగా మీపేర్లు ఓటరు జాబితాలో లేవన్నారు. దీంతో సదరు మహిళలు పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లి ఆర్డీవో స్రవంతి, నోడల్ అధికారి రాజలింగుతో వాగ్వాదానికి దిగారు. అయితే వారి ఓట్లు పట్టణ పరిఽధిలోకి వెళ్లాయని, వారు నివసిస్తున్న కాలనీ మున్సిపల్ పరిధిలోకి వస్తుందని ఆర్డీవో నచ్చజెప్పడంతో శాంతించి వెనుదిరిగారు.


