విద్యుత్‌షాక్‌తో యువకుడు..
కుభీర్: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు కుభీర్‌కు చెందిన శ్యామ్ మండల కేంద్రంలో టెంట్‌హౌజ్ నిర్వహిస్తున్నాడు. వరుసకు సోదరుడైన రాంబోల్ నవీన్ (25) అతని వద్ద పనిచేస్తున్నాడు. ఆదివారం మండలంలోని సిర్పెల్లి తండాలో కిశోర్ అనే వ్యక్తి చేనులో టెంట్ వేసేందుకు ఇద్దరూ కలిసి వెళ్లారు. టెంట్ వేసేక్రమంలో నవీన్ ఇనుపపైపును పైకి లేపగా పైన ఉన్న లెవన్ కేవీ విద్యుత్‌లైన్‌కు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. అతన్ని రక్షించే ప్రయత్నంలో శ్యామ్‌కు కూడా స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. మృతుని తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


