జాతీయస్థాయి సదస్సుకు నిర్మల్‌వాసి
నిర్మల్‌ఖిల్లా: బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్(బీడబ్ల్యూఐ) ఆధ్వర్యంలో ఈ నెల 15న చైన్నెలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వలస కార్మికుల సదస్సుకు నిర్మల్ జిల్లా వాసి స్వదేశ్ పరికిపండ్లకు ఆహ్వానం అందింది. దేశంలోని ఆయా భౌగోళిక ప్రాంతాల్లో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చ ర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల కోసం చేపట్టిన ‘సీఎం ప్రవాసి ప్రజా వాణి’ ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏ ర్పాటు చేసిన ‘గల్ఫ్ ప్రజావాణి’ వంటివి గల్ఫ్ కార్మికుల సమస్యలపై పనిచేస్తున్న తీరును ఇందులో వివరించనున్నట్లు ఆయన తెలిపారు.
హెచ్‌ఎంఎస్ ఇన్‌చార్జిగా సుదర్శన్
మందమర్రిరూరల్: హెచ్‌ఎంఎస్ బెల్లంపల్లి రీజి యన్ ఇన్‌చార్జిగా వెల్ది సుదర్శన్‌ను నియమిస్తూ యూనియన్ ప్రధాన కా ర్యదర్శి రియాజ్ అహ్మద్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సుదర్శన్ మాట్లాడుతూ రీజియన్‌లో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
టీ20 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ 2025 క్రికెట్ టోర్నీకి ఈనెల 16న జిల్లా కేంద్రంలో సీనియర్ క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ ప్రదీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఒక జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల సీనియర్ క్రికెట్ క్రీడాకారులు ఆధార్‌కార్డు, సొంత క్రికెట్ కిట్, యూనిఫాంతో ఈ నెల 16న మంచిర్యాల జెడ్పీ బాలుర మైదానంలో హాజరు కావాలని సూచించారు.
జాతీయస్థాయి సదస్సుకు నిర్మల్‌వాసి


