సింగరేణి నిధులు దుర్వినియోగం
మంచిర్యాలటౌన్: ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులతో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తెచ్చిపెడితే, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేని కార్యక్రమాలకు సింగరేణి నిధులు ఖర్చు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మెస్సీ పర్యటనను పార్టీ స్వాగతిస్తుందని, కానీ సింగరేణి నిధులను వెచ్చించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మికులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సింగరేణి కార్యాలయా ల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పురుషోత్తం జాజు, గాజుల ముఖేశ్‌గౌడ్, రాజ్‌కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, బింగి ప్రవీణ్, రావణవేణి శ్రీనివాస్, రాకేశ్ రెన్వా, మద్ది సుమన్, చిరంజీవి, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, మాడిశెట్టి మహేశ్ పాల్గొన్నారు.


