‘హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలి’
శ్రీరాంపూర్: హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే నర్సింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్‌లోని ఓ పాఠశాలలో ఆ సంఘం మంచిర్యాల కార్పొరేషన్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయడం వలన పాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని, ఎస్సీ సంక్షేమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ భవన్ ఏర్పా టు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా జక్కా మొగిలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు బింగి సదానందం, నాయకులు పుట్ట రవి, మద్దెల స్వామి, కాటన్ కృష్ణ, భోగ శంకర్, నరసయ్య, సొల్లు కొమురయ్య, మొగిలి వాసు, రాజశేఖర్ పాల్గొన్నారు.


