రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
తాండూర్: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ మనోహర్ తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రోళ్లపహాడ్ గ్రామానికి చెందిన కృష్ణస్వామి–సుమలత దంపతుల కుమార్తె అయిన సహస్ర(3)ను ఆదివారం అతని సోదరుడైన తుంగెర గణేశ్ బైక్‌పై రెబ్బెన మండలంలోని కొమురవెళ్లికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రేచిని గ్రామపంచాయతీ పరిధిలోని బల్హాన్‌పూర్ వద్దకు చేరుకోగానే రేచిని నుంచి వస్తున్న బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సహస్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


