ఆరోగ్య హక్కుపై అవగాహన ఉండాలి
చెన్నూర్: ప్రతీ పౌరునికి ఆరోగ్య హక్కుపై అవగాహన ఉండాలని డీసీహెచ్‌ఎస్ కోటేశ్వర్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌పై జిల్లా న్యాయ సేవ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య సేవలు, పథకాలను చేరవేయాలని తెలిపారు. రోగులకు లభ్యమయ్యే ఉచిత సేవలు, చట్టపరమైన రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే అవగాహన సదస్సు ఉద్దేశమని అన్నారు. అనంతరం న్యాయవాదులు ఆరోగ్యశ్రీ, జననీ శిశు సురక్షా, ఉచిత ఔషధ పంపిణీ హక్కులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, న్యాయ సలహా మండలి న్యాయవాదులు మల్లేశం, కాయిత మహేశ్, ప్రభాకర్, రాజశేఖర్, వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.


