గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
తిర్యాణి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని గడలపెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హంసబాయి పెద్ద కుమార్తె ఆత్రం శంకరమ్మ బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తుండగా చిన్న కుమార్తె సిడాం విమల కాంగ్రెస్ మద్దతులో బరిలో నిలిచింది. వీరిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
ఆత్రం శంకరమ్మ
సిడాం విమల
లగ్గాంలో
అన్నదమ్ముల సవాల్
దహెగాం: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని లగ్గాం పంచాయతీ సర్పంచ్‌గా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో సొంత అన్నదమ్ములు మోరె తిరుపతి, మోరె వెంకన్న వేర్వేరు పార్టీల మద్దతుతో బరిలో నిలిచారు. వెంకన్న కాంగ్రెస్ మద్దతుతో తిరుపతి బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఈ అన్నాదమ్ముల సవాల్‌లో గెలుపెవరిదో ఆదివారం సాయంత్రం తేలనుంది.
మోరె తిరుపతి
మోరె వెంకన్న
సుంగాపూర్‌లో..
తిర్యాణి మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన సొంత అన్నాదమ్ములు సర్పంచ్‌లో బరిలో నిలిచారు. టేకం గుండయ్య మూడో కు మారుడు మారుతి బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీలో ఉండగా చిన్న కుమారుడు సురేశ్ కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్నాడు. వీరు పోటీలో ఉండటం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
టేకం సురేశ్
టేకం మారుతి
చిన్నపంచాయతీ.. ఏడుగురు అభ్యర్థులు
తాండూర్: మండలంలోని అతి చిన్న గ్రామపంచాయతీ అయిన నీలాయపల్లిలో ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి గత ఎన్నికల సమయంలో నీలాయపల్లి నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి గ్రామపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. నీలాయపల్లి ఒడ్డెర కాలనీ, పుల్ల య్యగూడెం హ్యాబిటెక్స్‌లోని ఈ గ్రామపంచాయతీ పరిధిలో 292 మంది ఓటర్లున్నారు. ఇందులో 144 మంది పురుషులు, 148 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో 100 నుంచి 120 ఓట్లు సాధించినవారే గెలుపు కై వసం చేసుకునే అవకాశముంది. ఇప్పటికే ఎనిమిది వార్డుల్లో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. తొలిసారి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు


