వైజ్ఞానిక ప్రదర్శనకు ఆర్జీయూకేటీ విద్యార్థిని
బాసర: బాసర ఆర్జీయూకేటీకి చెందిన పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని వీ వాగ్దేవికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన బాల వైజ్ఞానిక ప్రదర్శనలో చోటు దక్కింది. ప్రాంతీయ విద్యాసంస్థ భోపాల్‌లో గత నెల 18నుంచి 23వరకు నిర్వహించిన రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తాను తయారు చేసిన వైజ్ఞానిక ఆవిష్కరణకు గాను ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ విద్యార్థినిని అభినందించారు. భవిష్యత్‌లో వాగ్దేవి మరిన్ని ఆవిష్కరణలు చేసి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను విశ్వవిద్యాలయం అందిస్తుందని తెలిపారు. ఆర్జీయూకేటీ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. డీన్‌లు డాక్టర్ ఎస్.విఠల్, ఎస్.శేఖర్ పాల్గొన్నారు.


