ఏజెన్సీ గ్రామంలో అభ్యర్థులు లేక..
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని చోర్‌పల్లి గ్రామపంచాయతీ ఏజెన్సీ గ్రామమైనా ఎక్కువ బీసీ ఓటర్లే ఉన్నారు. ఐదే ఎస్టీ కుటుంబాలున్నాయి. దీంతో పోటీ చేసే అభ్యర్థులు లేక ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అన్నదమ్ములే సర్పంచ్‌కు పోటీ పడుతున్నారు. ఇందులో కమ్మరి కృష్ణ, పెంటయ్య సొంత అన్నదమ్ములు పోటీలో ఉన్నారు. చోర్‌పల్లి గ్రామ పంచాయతీలో నాలుగు ఎస్టీ, నాలుగు జనరల్ వార్డులున్నాయి. ఐదు కుటుంబాల నుంచి నాలుగు వార్డు స్థానాలకు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారే పోటీ పడుతున్నారు. మూడు పార్టీలు నాలుగు ఎస్టీ వార్డుల్లో పోటీ చేయించాలంటే 12 మంది అభ్యర్థులు అవసరం. కానీ, ఊరిలో ఎనిమిది మందే ఉండటంతో మరో పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉత్పన్నమైంది.
కమ్మరి పెంటయ్య
కమ్మరి కృష్ణ
ఏజెన్సీ గ్రామంలో అభ్యర్థులు లేక..
ఏజెన్సీ గ్రామంలో అభ్యర్థులు లేక..


