గాడిద పాలకు భలే డిమాండ్
ముధోల్: గాడిద పాలకు భలే డిమాండ్ ఉంది. ఒకప్పుడు పెద్దలు ఇంట్లో చిన్నపిల్లలకు దగ్గు, దమ్ము, దడ, వ్యాధులు వచ్చినప్పుడు గాడిదపాలు తాగిపిస్తే తగ్గిపోయేది. ఇప్పుడు అట్లాంటి జబ్బులు వస్తే పెద్దపెద్ద ఆస్పత్రుల కు తీసుకెళ్లి అఽధిక డబ్బులు వెచ్చించి వ్యాధులను నయం చేసుకుంటున్నారు. మరికొంత మంది ఇప్పటికీ అప్పటి వైద్యం వాడుతూ జ బ్బులు నయం చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సినయాగావ్ తాలుకా జున్ని గ్రామానికి చెందిన రమేశ్ తనకున్న గాడిదను తీసుకువచ్చి పల్లెల్లో తిప్పుతున్నాడు. వాడవాడల్లో దగ్గు, దమ్ముకు గాడిద పాలు అంటూ తిరుగు తూ ఒక జండూమామ్ సీసా గాడిద పాలను రూ.150కు విక్రయిస్తున్నాడు.


