రేపు నవోదయ ప్రవేశపరీక్ష
కాగజ్‌నగర్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో నిర్వహించే ప్రవేశాలకు శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 6,196 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో ఐదు కేంద్రాల్లో 1290 మంది, నిర్మల్‌లో ఆరు కేంద్రాల్లో 1552, మంచిర్యాలలో 7 కేంద్రాల్లో 1722, ఆసిఫాబాద్‌లో ఆరు కేంద్రాల్లో 1632 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్, ఆధార్‌కార్డు తీసుకుని విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.


