ఐఐటీ జేఈఈ కోచింగ్‌కు దీక్ష ఎంపిక
మంచిర్యాలఅర్బన్: రాష్ట్రస్థాయిలో నిర్వహించి న ఆన్‌లైన్ పరీక్షలో మంచి మార్కులు సాధించి మంచిర్యాల కేజీబీవీకి చెందిన ఎల్ములే దీక్ష ఐఐటీ, జేఈఈ కోచింగ్‌కు ఎంపికై ంది. జిల్లాలోని 10 సైన్స్ గ్రూప్ కేజీబీవీల నుంచి దీక్ష ఒ క్కరే రాష్ట్రస్థాయి కోచింగ్‌కు సెలక్టయ్యారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ కేజీబీ వీలో నిర్వహించే కోచింగ్ సెంటర్‌కు గురువా రం వెళ్లారు. ప్రతిభ కనబర్చిన ఆమెను ఎస్‌వో స్వప్న, ఉపాధ్యాయినులు అభినందించారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
శ్రీరాంపూర్: సింగరేణి పాఠశాలలో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎడ్యూకేషన్ జీఎం ఎస్.వెంకటాచారి తెలిపారు. గురువారం ఆయన సీసీసీలోని సింగరేణి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి విద్యార్థుల హాజరుశాతం, ఉత్తీర్ణత వివరాలు తెలుసుకున్నారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. కరస్పాండెంట్ రాజేష్, హెచ్‌ఎం శ్రీనివాస్ ఉన్నారు.
ఐఐటీ జేఈఈ కోచింగ్‌కు దీక్ష ఎంపిక


