పోలింగ్ ఇక్కడ..లెక్కింపు అక్కడ
కడెం: పంచాయతీ ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు చేస్తారు. మండలంలోని రాంపూర్‌మైసంపేట్ పునరావాస గ్రామంలో రెండు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓట్లను 32 కి.మీ దూరాన ఉడుంపూర్ జీపీకి తీసుకెళ్లి అక్కడ లెక్కించారు. పునరావాసంలో భాగంగా రెండు గ్రామాలను టైగర్‌జోన్ నుంచి తరలించడంతో గ్రామ పంచాయతీకి దూరభారం పెరిగింది. రెండు గ్రామాలను కలిపి ప్రత్యేక జీపీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అది కొన్ని కారణాల వల్ల సాధ్యం కాకపోవడంతో గ్రామస్తుల సౌకర్యార్థం ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ ఇక్కడ..లెక్కింపు అక్కడ


