రోడ్డు ప్రమాదంలో రైల్వేఉద్యోగి మృతి
సారంగపూర్: రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన దేవత్ రాజశేఖర్(30) ఆర్మూర్ రైల్వేస్టేషన్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్‌పై ధని గ్రామంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. రాత్రి తిరిగి స్వగ్రామానికి తిరుగుపయనమయ్యాడు. ధని మూలమలుపు వద్ద రోడ్డుకు అడ్డుగా అడవిపందులు రావడంతో వాటిని తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. రాజశేఖర్‌ను నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు. మృతుడి భార్య రంజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఐదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


