‘నవోదయ’ పరీక్ష నిర్వహణపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’ పరీక్ష నిర్వహణపై సమీక్ష

Dec 11 2025 7:26 AM | Updated on Dec 11 2025 7:26 AM

‘నవోదయ’ పరీక్ష నిర్వహణపై సమీక్ష

‘నవోదయ’ పరీక్ష నిర్వహణపై సమీక్ష

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి గానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న పరీక్షపై ప్రిన్సిపాల్‌ రేపాల కృష్ణ బుధవారం అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఈ నెల 13న జరుగనున్న పరీక్షకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 24 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,196 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement