గుర్తింపు కార్డు తప్పనిసరి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఓటరు స్లిప్‌తో పాటు గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
గుర్తింపు కార్డులు ఇవీ..
ఆధార్ కార్డు, పీహెచ్‌సీ ఫొటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్ర భుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు, బ్యాంకులు, కోఆపరేటివ్ సంస్థలు ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డులు, ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డు, జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్) కార్డు, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు, కార్మిక శాఖ జారీచేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం కార్డు, మాజీ సైనికులు, వితంతువుల పింఛను పుస్తకం, వృద్ధుల పింఛను పత్రం, ఫొటోతో కూడిన రేషను కార్డు, ఫొటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సు, దివ్యాంగుల ధ్రువపత్రం, ఫొటోతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం.


