అధికారుల తప్పిదంతో ఆత్మలకు ఓట్లు..!
దహెగాం: ఓటరు జాబితాలో బతికున్న వారి పేర్లు లేవని గోల పెట్టిన ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల క్రితం నుంచే ఓటరు జాబితా సవరణ చేపట్టారు. పేర్లు లేనివారివి చేర్చడం, మృతి చెందిన వారి పేర్లను తొలగించడం జరిగింది. అధికారుల తప్పిదం వల్ల మృతి చెంది ఏడాది, రెండేళ్లు కావస్తున్నా వారి పేర్లు ఓటరు జాబితాలో కనిపించడంతో ఓటర్లు ఇంకా బతికే ఉన్నారా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని మూడవ వార్డులో 226 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సుమారుగా ఆరుగురు మృతి చెందిన వారు ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. మండలం మొత్తం మీద ఇంకెంత మంది ఉన్నారోనని పలువురు చర్చించుకుంటున్నారు.
అధికారుల తప్పిదంతో ఆత్మలకు ఓట్లు..!


