ఎడమచేతి చూపుడు వేలిపై సిరా
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తిని గుర్తు పట్టేందుకు ఎన్నికల కమిషన్ ఓటరు ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఓటరు తన గుర్తింపు కార్డు చూపించిన తర్వాత ఓటరు జాబితాలో ఉన్న పేరు పరిశీలించి, పోలింగ్ ఏజెంట్ కూడా ఓటరును గుర్తించిన అనంతరం ఎడమచేతి చూపుడు వేలిపై సిబ్బంది సిరా చుక్క వేస్తారు. ఆ తర్వాత ఓటరు తన బ్యాలెట్ పేపరు తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది.
సహాయకుడికి కుడి చేతి చూపుడు వేలిపై..
అంధులు, అశక్తులైన (మానసిక సమస్య ఉన్న) వారు ఓటేసేందుకు 18 ఏళ్లు నిండిన వ్యక్తిని సహాయకుడిగా ఎంచుకోవచ్చు. ఇదే వి షయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తే అ నుమతి లభిస్తుంది. సహాయకుడితో వెళ్లి ఓట రు ఓటు హక్కు వినియోగించుకుంటాడు. ఎవరికి ఓటేశారనే విషయాన్ని సహాయకుడు గో ప్యంగా ఉంచాలి. మరోమారు ఇతరులకు సహాయకుడిగా రానంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. ఓటరుకు ఎడమచేతి చూపుడు వేలిపై సహాయకుడికి కుడి చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు.


