పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, సాధారణ వ్యయ పరిశీలకులు, డీపీవోలతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, ఎన్ని కల నిబంధనల అమలు, ఓటర్ల ప్రభావిత అంశాల ను అరికట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో 81 సర్పంచ్, 514 వార్డు స భ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చె ప్పారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపా రు. స్టేజ్–2 ఆర్వోలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్పింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరి గేలా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోహర్, అధికారి రాజేశ్వర్, డీసీపీ భాస్కర్, అదనపు ఎన్నికల అధికారి, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


