వాహన తనిఖీల్లో చీరల పట్టివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హాజీపూర్‌లో మంగళవారం రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఓ కారు ఆపకుండా వెళ్లగా అనుమానంతో వచ్చి వెంబడించి పట్టుకున్నారు. కారులో భారీగా చీరలు బయటపడ్డాయి. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. పంచనామా జరిపి కారును కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనం, పట్టుబడిన చీరల సమాచారం తెలుసుకుని స్టాటికల్ సర్వే బృందానికి అప్పగిస్తామని హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. కాగా ఈ చీరలు హాజీపూర్‌లో బీజేపీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థికి చెందినవని సమాచారం.


