సంతానం కలుగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందప డి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ట్లు జీర్‌పీ హెడ్ కానిస్టేబుల్ జ స్వాల్ సింగ్ మంగళవారం తెలి పారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సాగే శ్రీనివాస్ (35) మంచిర్యాలలో ఇంటర్ నెట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తున్నా సంతానం కలుగడంలేదని రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం రాత్రి బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సరిత ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి దేవునిగూడ గ్రామానికి చెందిన గవ్వల మురళి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిలువ ఉంచిన 8 టేకు దుంగలు లభ్యమైనట్లు తెలిపారు. కర్రతో పాటు కోత మిషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు. కలప విలువ రూ.30 వేల వరకు ఉంటుందన్నారు. నిందితుడు మురళిపై కేసు నమోదు చేసిన ట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో డీఆర్వో కుమారస్వామి, సెక్షన్ అధికారులు రవి, మధుకర్, పురుషోత్తం, ఎఫ్‌బీవోలు తన్వీర్‌పాషా, లవన్ పాల్గొన్నారు.
తాటిచెట్టు పైనుంచి పడి తీవ్రగాయాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తాటిచెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం పెద్దంపేటకు చెందిన గీత కార్మికుడు కోట భాస్కర్ మంగళవారం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
సంతానం కలుగడంలేదని ఒకరు ఆత్మహత్య


