ప్రతీ ఉద్యోగి రక్షణలో భాగస్వామ్యం కావాలి
మందమర్రిరూరల్: ప్రతీ సింగరేణి ఉద్యోగి రక్షణలో భాగస్వాములై బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలని మందమర్రి ఏరియా జీ ఎం రాధాకృష్ణ అన్నారు. సింగరేణి 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం సేఫ్టీ క మిటీ కన్వీనర్ లక్ష్మీపతిగౌడ్‌తో కలిసి ఏరియాలోని కేకేఓసీని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, శ్రీనివాస్ (ఎస్వోటు జీఎం), వీరన్న (ఈఈ, ఈ అండ్ ఎం), లక్ష్మీరాజు (ఎస్‌ఎస్‌వో), టి శంకర్ (అడిషనల్ మేనేజర్), నాగేశ్వరరావు (మెడికల్ సూపరింటెండెంట్) తదితరులు పాల్గొన్నారు.
ఆర్కే 7 గనిపై..
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్‌లోని ఆర్కే 7 గనిపై జీఎం ఎం.శ్రీనివాస్ ఉద్యోగులతో రక్షణ ప్రతి జ్ఞ చేయించారు. రక్షణ తనిఖీ బృందం కన్వీనర్, జీఎం బీ.సైదులు, బెల్లంపల్లి రీజియ న్‌్ సేఫ్టీ జీఎం కే రఘుకుమార్, ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రెట రీ బాజీసైదా, ఏరియా ఇంజనీర్ రమణరావు, ఏజెంట్ కుర్మ రాజేందర్, గని మేనేజర్ జే తిరుపతి, రక్షణాధికారి సంతోశ్‌రావు,పాల్గొన్నారు.
కాసిపేట గనిపై..
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–1 గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో బృందం కన్వీనర్ విజయ్‌ప్రసాద్ మాట్లాడుతూ రక్షణ ఉత్పత్తి రెండు సమానంగా ఉన్నప్పుడే సంస్థ బాగుంటుందన్నారు. రక్షణ నియమాలు పాటిస్తూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఏజెంట్ రాంబాబు, ఎస్‌ఓటూ జీఎం లలిత ప్రసాద్, మేనేజర్ సతీష్, రక్షణాధికారి నిఖిల్‌అయ్యర్, డెప్యూటీ మేనేజర్ వెంకటేష్, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు.


