వైన్స్‌లో భారీ చోరీ
కై లాస్‌నగర్(బేల): బేల మండల కేంద్రంలోని శ్రీ దుర్గ వైన్స్‌లో ఆదివారం రాత్రి చోరీ జరి గింది. సోమవారం ఉదయం వైన్స్‌కు వచ్చిన యజమాని బాల్‌రాజ్ గౌడ్ షాపు తెరవగా న గదుతో పాటు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. షాపు వెనకాల గల వెంటిలెటర్ తొలగించి ఉండడం, సీసీ కెమెరాలు పగలగొ ట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. క్లూస్ టీమ్ డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేపట్టారు. ఎస్సై ప్రవీణ్ సీపీ ఫుటేజీని పరిశీలించారు. ఘటనలో రూ. 3 లక్షల 15 వేల నగదుతో పాటు రూ.20వేల విలువైన మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు యజ మాని తెలిపాడు. గతంలో కూడా ఇదే వైన్స్‌లో చోరీ జరగగా, 58 మద్యం బాటిళ్లతో పాటు దాదాపుగా రూ.36 వేల నగదు దోచుకెళ్లారు.


