రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డు ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగా యాలైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన కొండపర్తి సందీప్ (27) సీసీసీ నస్పూర్ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతని బంధువైన (సడ్డకుడు) మంచిర్యాలలోని ఏసీసీలో ఉంటున్న సుమన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సీసీసీ నస్పూర్ నుంచి ఏసీసీకి వస్తుండగా ఫ్‌లైఓవర్ బ్రిడ్జి డౌన్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఘటనలో సందీప్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. సుమన్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్ పైనుంచి పడి మహిళ..
సారంగపూర్: ట్రాక్టర్‌పై నుంచి కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఒరిస్సాకు చెందిన భానుమతి (30), ఆమె భర్త జగమండ్ మూడేళ్లుగా చించోలి(బి)లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం రాత్రి పనులు ముగిశాక ఇద్దరూ కలిసి ట్రాక్టర్ ఎక్కి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు భానుమతి కిందపడింది. తీవ్రగాయాలు కావడంతో 108లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
భీమారం: ఈనెల 7న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన కాజిపల్లి గ్రా మానికి చెందిన జాగెటి శంకర్ (43) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. కాజిపల్లి గ్రామ పంచాయతీలో వర్కర్‌గా పనిచేస్తున్న శంకర్ కుటుంబ అవసరాలకోసం చేసిన అప్పులు తీర్చేమార్గంలేక ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమి త్తం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


