ప్రతీ ఉద్యోగి రక్షణలో భాగస్వామి కావాలి
బెల్లంపల్లి: బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఉద్యోగి విఽధిగా రక్షణలో భాగస్వామి కావాలని సేఫ్టీ కమిటీ కన్వీనర్, జీఎం (ఎన్విరాన్మెంట్) బి.సైదులు, మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. సింగరేణి 56వ రక్షణ పక్షోత్సవాలో భాగంగా సోమవారం శాంతిఖని గనిని సేఫ్టీ కమిటీ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా గని ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జీఎం (సేఫ్టీ ) కె.రఘుకుమార్, సేఫ్టీ అధికారి భూ శంకరయ్య, ఎస్‌వోటు జీఎం జీఎల్‌ప్రసాద్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి
శ్రీరాంపూర్: ప్రతీ ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో జరిగిన పక్షోత్సవాల్లో జీఎం మాట్లాడుతూ రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఏరియా ఇంజినీర్ టీ.రామారావు, రక్షణాధికారి విజయ్‌కుమార్, ఇన్‌చార్జి డీజీఎం చంద్రలింగం, తదితరులు పాల్గొన్నారు.
ఆర్కే 7 గనిలో..
ఆర్కే 7 గనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గని రక్షణాధికారి సంతోశ్‌రావు, పిట్ ఇంజినీర్ ప్రవీణ్‌కుమార్, ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ సారయ్య, అధి కారులు రవీందర్, బాలకృష్ణ, శంతన్ పాల్గొన్నారు.


